FAQ:(ఎఫ్ ఎ క్యూ)
- శ్రీ సాయిస్మృతులు పత్రిక గురించి?
శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ జీవితం వారి బోధలు, ఆధ్యాత్మిక విశేషాలు, భక్తుల అనుభవాలు సవివరంగా తెలియజెప్పే, సమాచార వాహికయే మన పత్రిక.
- ప్రచురణ కర్తలు ఎవరు?
ప్రచురణకర్తలు శ్రీ షిర్డీ సాయి సంస్థ (చికాగో) వారు. ఈ సంస్థ విశ్వవ్యాప్త సాయితత్వ ప్రచార సారధి గురూజీ డా || శ్రీ చంద్రభాను సత్పతి గారి పర్యవేక్షణలో నడపబడుచున్నది.
- దీనిని ఏ ఏ మాధ్యమముల ద్వారా పొందవచ్చును?
శ్రీ షిర్డీ సాయి ఆశీర్వాదం.ఆర్గ్ లేదా సాయిబాబా.ఆర్గ్ / స్మృతులు. వెబ్ సైట్ల ద్వారా సబ్ స్క్రైబ్ అయి పొందవచ్చును.
- ఇంకా ఏరకముగా పొందగలను.
ఇది ఈ మ్యాగజైన్ పత్రిక. టెక్స్ట్ ద్వారా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ పొందవచ్చును.
- దీనికై లాగిన్ ఎందుకు?
- దుర్వినియోగము కాకుండా లాగిన్ అవసరం చేయబడినది.
- ఏమైనా వ్యాసములు, అనుభవములు పంపవచ్చునా?
పంపవచ్చును. ఆమోదయోగ్యం పొందిన రచనలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఆంగ్లములో పంపే రచనలు అనువాదం అయిన పిదప పరిశీలింపబడును.
- నా అభిప్రాయములు ఎలా తెలుపగలను?
సాయి స్మృతులు@ సాయిబాబా.ఆర్గ్ అనే ఈ మెయిల్ ద్వారా
- పుస్తక రూపములో ఉన్నదా?
లేదు. పబ్లికేషన్ వ్యయము ఎక్కువగా ఉన్నందున ఆన్ లైన్ ద్వారానే పొందవచ్చును . వదాన్యులు ధర్మకార్య స్పూర్తితో సహకరించిన ప్రచురించగలము.
- ఈ మెయిల్లో పంపగలరా?
లింక్ పంపగలము. లింక్ కై యాక్సస్ పొందవలయును.
- ప్రింటింగ్ చేయవచ్చా?
వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రింటింగ్ చేసుకోవచ్చు.
- ఇందులో నచ్చిన అంశములను ఎలా వాడగలను?
సమాచారముపై ప్రచురణకర్తకు, రచయితలకు పూర్తి హక్కులు కలవు.కాపీయింగ్,డూప్లికేషన్ కొరకు వ్రాత పూర్వకముగా అనుమతి పొందవలెను.
- స్మార్ట్ ఫోన్ మరియు టాబ్లెట్ లలో పొందవచ్చా?
మొబైల్ బ్రౌజర్లలో పొంద వీలువుంది మరియు ఈ మొబైల్ యాప్ లేటెస్ట్ డివైస్లలోనే టెస్ట్ చేయబడినది.
- ఆఫ్ లైన్ లో వున్ననూ దీనిని చూడవచ్చా?
అన్ని స్మార్ట్ ఫోన్లలో వెబ్ యాప్ లాగా పనిచేస్తుంది. డివైజ్ బ్రౌజర్ లో " యాడ్ తో హోమ్ " స్క్రీన్ బటన్ వాడి సేవ్ చేసుకొని, మ్యాగజైన్ మొత్తం డౌన్లోడ్ అయిన తరువాత ఎయిరోప్లేన్ మోడ్లో అన్ని పేజీలు సరిచూసికొనినయెడల ఆఫ్ లైన్ లో కూడా చదవవచ్చును.
-ఒకవేళ ఇది డివైజ్ లో రాకుంటే ఎలా?
డివైజ్లు లేటెస్ట్ బ్రౌజర్ బేస్డ్ అయి ఉండవలెను. జావా స్క్రిప్ట్ మరియు కుకీస్ ఎనేబుల్ అయివుండవలెను.
- దీనికై పైకము చెల్లించవలయునా?
దీని తయారీ లో వ్యయము తప్పక వుండి తీరును గాన, మీ వంతు సహాయ సహకారములు అందించదలచిన ఈ క్రింద లింక్ ను క్లిక్ చేసి వివరములు పొందగలరు.
- పై ప్రశ్నలలో నాకు స్ఫురించిన ప్రశ్న లేకున్న సమాధానం పొందుట ఎలా?
సబ్జెక్టులో న్యూ టాపిక్ అని టైపు చేసి,సాయిస్మృతులు@సాయిబాబా.ఆర్గ్ కు మెయిల్ చేయవలెను